YS Avinash Reddy : మెరుగుపడిన అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం, ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ
విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని..సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.

YS Avinash Reddy mother health
ys avinash reddy : అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని..సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. కానీ పూర్తిగా అమ్మ కోలుకోలేదని మెరుగైన వైద్యం కోసం వేరు ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో నా తల్లి అనారోగ్యానికి గురి అయిన సందర్భంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి ఎవ్వరు మనసులో పెట్టుకోవద్దు అందరికీ న్యాయం జరుగుతుంది.. అని వెల్లడించారు.
JC Prabhakar Reddy: వివేకానంద హత్యకేసుపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి కర్నూలు లోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆసుపత్రి వైద్యులు ఆమె హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. లక్ష్మమ్మకు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తామని విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. కానీ ఆమె గుండెకు సంబంధించి చికిత్స అవసరమని..దీని కోసం మెరుగైన ఆసుపత్రికి వేరే ఆస్పత్రికి మార్చబోతున్నామని తెలిపారు.
కాగా మెరుగైన చికిత్స్ కోసం లక్ష్మమ్మను హైదరాబాద్ లేదా బెంగళూరు కు తరలించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
YSR Sister Vimalamma : వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ