Mudragada: పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం

జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Mudragada: పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం

Mudragada - Pawan

Updated On : February 29, 2024 / 10:29 AM IST

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేతలు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న హరిరామ జోగయ్య లేఖ రాయగా, ఇవాళ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పవన్ పలుమార్లు కిర్లంపూడిలోని తన నివాసానికి వస్తానని కబురు పంపి రాలేదని ముద్రగడ తెలిపారు. ‘మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎంతోమంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి?’ అని అన్నారు.

తనకు ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా పవన్‌తో పాటు పని చేసేందుకు సిద్ధపడ్డానని ముద్రగడ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గతం, అవమానాలు, బాధలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి పని చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు.

‘మీలాగా నేను గ్లామర్ ఉన్న వారిని పరపతి ఉన్న వాడిని కాదు. తుప్పుపెట్టిన ఇనుములాంటివాడిని.. అందుకే నన్ను లాస్ట్ గ్రేట్ లో పెట్టారు’ అని ముద్రగడ పద్మనాభం లేఖలో రాశారు. జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

కాగా, ఎన్నికల వేళ ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేస్తున్న సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? లేదా? అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ముద్రగడ లేఖ

హరిరామ జోగయ్య రాసిన లేఖ

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‎‎ దృష్టి.. పరిశీలనలో వీరి పేర్లు..