Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది.. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ మద్దతిస్తుంది
ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు

Nara Lokesh
Municipal Workers Strike: ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ మోసం చేశాడని లోకేశ్ విమర్శించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంకోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకుకూడా టీడీపీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తోందని నారా లోకేశ్ తెలిపారు. అంగన్ వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని నారా లోకేశ్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా మన్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం విధితమే. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీనికితోడు సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : RGV: హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీసు ముందు అలజడి.. వీడియో పోస్ట్ చేసిన వర్మ
మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేవ్వరరావు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికుల రిస్కు, హెల్త్ అలవెన్సులు, క్లాప్ డ్రైవర్లకు 18,500 జీతంపై ప్రభుత్వం నుంచి ఇప్పటికి స్పష్టత రాలేదు. దశలవారీగా ప్రభుత్వంతో జరిపిన చర్చలన్నీ విఫలం అయ్యాయి. దీంతో మంగళవారం తెల్లవారు జామునుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లినట్లు తెలిపారు.