కళ్ళల్లో కారం కొట్టి భార్యా,భర్తలపై హత్యాయత్నం, భర్త మృతి

Murder attack on couples, husband died : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడలో మంగళవారం ఉదయం దంపతుల కళ్లలో కారంకొట్టి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉన్న మేడపాటి సూర్యనారాయణరెడ్డి ని (35) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బయటకు పిలిచారు. అతను బయటకు రాగానే కళ్లల్లో కారం చల్లి దారుణంగా హత్య చేసారు.
భర్తపై దాడిన అడ్డుకోబోయిన అతని భార్యను కూడా దుండగులు కత్తులతో పొడిచారు. ఘటనా స్ధలంలో సూర్యనారాయణ రెడ్డి మరణించాడు. తీవ్రంగా గాయపడిన అతని భార్యను పెదపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం జరిగిన కొవ్వూరి ఇంద్రారెడ్డి హత్యకేసులో సూర్యనారాయణరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.