Nara Bhuvaneshwari : అరెస్ట్ చేశారు గానీ ఆధారాలు చూపించలేకపోతున్నారు : సిఐడి అధికారులపై భువనేశ్వరి వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు గానీ ఇంత వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని..ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు..ఇలాంటి ఘటనలు నేను ఎక్కడా చూడలేదు అని అన్నారు.

Nara Bhuvaneshwari : అరెస్ట్ చేశారు గానీ ఆధారాలు చూపించలేకపోతున్నారు : సిఐడి అధికారులపై భువనేశ్వరి వ్యాఖ్యలు

nara bhuvaneshwari

Updated On : September 27, 2023 / 1:18 PM IST

Chandrababu arrest..Nara Bhuvaneshwari : చంద్రబాబుతో అరెస్ట్ తరువాత ఆయన భార్య నారా భువనేశ్వరి మొదటిసారిగా ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిసనలు చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా సీతానగరం మండలం సీతానగరంలో బాబుతో మేము అంటూ మహిళల సంఘీభావ దీక్షలో పాల్గొన్నారు నారా భువనేశ్వరి.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతు..స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు గానీ ఇంత వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని..ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు..ఇలాంటి ఘటనలు నేను ఎక్కడా చూడలేదు అని అన్నారు. అవినీతి జరిగితే ఆధారాలు సేకరించి వాటిని చూపించి అరెస్ట్ చేయాలని అలా చేస్తే తప్పులేదు. కానీ ఆధారాలే లేవు..అయినా అరెస్ట్ చేశారు ఇది అన్యాయం అని వాపోయారు. అరెస్ట్ చేశాక ఆధారాలు సేకరించే పనిలో ఉన్న సీఐడీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని విమర్శించారు.

AP ACB Court : ఇరుపక్షాల లాయర్లు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి అప్పుడు విచారణ చేద్దాం : ఏసీబీ కోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి డబ్బులు దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కానీ ఆ డబ్బులు ఎవరి ఖాతా లోకి వెళ్ళాయో ఇప్పుడు వరకు సిఐడి అధికారులు చూపించలేకపోయారని విమర్శించారు. 19రోజుల నుండి చంద్రబాబు నాయుడు నీ నిర్బంధించారు..కానీ ఇప్పటి వరకు ఆధారాలే చూపించలేకపోతున్నారని విమర్శించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు..ఇలాంటిది

నేను ఎక్కడా చూడలేదు..సిఐడి కూడా ఏమీ చేయలేకపోతోందని అన్నారు. సిఐడి అధికారులు విచారణలో కూడా చంద్రబాబు నాయుడే తిరిగి ప్రశ్నలు అడిగి ఉంటారని అభిప్రాయపడ్డారు భువనేశ్వరి. 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు .. నిరంతరం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం, యువత ఉద్యోగం కోసమే ఆయన ఆలోచన చేస్తారు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

AP High Court : హైకోర్టులో ఉండవల్లి వేసిన స్కిల్ కేసుపై పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎంతోమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని..స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత సుమారు రెండు లక్షల మందికి ఒక దారి చూపించారుని యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించడం వల్ల ఒక మహిళ కు ఉద్యోగం వచ్చిందని చెప్పారని ఈ సందర్బంగా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు మహిళలను ఎంతగానో గౌరవిస్తారని మహిళల మీద చాలా నమ్మకం ఉందని అన్నారు. చంద్రబాబుకి..మహిళా శక్తికి చంద్రబాబుపై నమ్మకం ఉంది..ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని ఈరోజు నిర్బంధించారు వాళ్లకి ఏం సంతోషమో వాళ్ళకే తెలియాలి అంటూ విమర్శించారు.

శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై మహిళలు పైపోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు..ఈ సృష్టికి మూల కర్త ఒక మహిళనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అంటూ మండిపడ్డారు.శాంతియుతంగా మనమందరం కలిసి పోరాటం చేద్దాం అని ఈ సందర్భంగా మహిళలకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. లోకేశ్ చేస్తున్న యువగ పాదయాత్రను కూడా అనేక విధాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టారని..అయినా ఏదీ ఆగదని అన్నారు. మాజీ ఎంపీ 70 సంవత్సరాల నిండిన సీతామహాలక్ష్మి ఆస్పత్రిలో ఉంటే హత్య యత్నం కేస్ పెట్టారని ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆమె వాపోయారు.