Nara Lokesh: ఏపీ ఎన్నికల వేళ వైసీపీలో సీట్ల కసరత్తుపై నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

కడప ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలు ఉన్నారని చెప్పారు. 

Nara Lokesh: ఏపీ ఎన్నికల వేళ వైసీపీలో సీట్ల కసరత్తుపై నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

Nara Lokesh

Updated On : December 29, 2023 / 12:36 PM IST

వైసీపీలో జరుగుతున్న సీట్ల కసరత్తుపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు ఉన్న సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తుందని చెప్పారు. ఇవాళ లోకేశ్ మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో రెండు సార్లు రెడ్లకే టికెట్ ఇచ్చారని తెలిపారు.

ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ ఓడిపోతుందని బీసీకి టికెట్ ఇచ్చారని నారా లోకేశ్ చెప్పారు. కడప ఎంపీ టికెట్ ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలు ఉన్నారని చెప్పారు.

చిలకలూరి పేటలో మంత్రి విడదల రజనీ రాణించడం లేదని జగన్ అన్నారని నారా లోకేశ్ తెలిపారు. చిలకలూరి పేటకు పనికిరాని విడదల రజనీ మరి గుంటూరు వెస్టులో ఎలా పనికొస్తారని నిలదీశారు. బీసీల సంక్షేమానికి టీడీపీ మాత్రమే కృషి చేస్తుందని చెప్పారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తు అధికారులపై టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయ విచారణ చేయిస్తామని తాము చెప్పామని లోకేశ్ అన్నారు. దీనిపై రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటని నిలదీశారు. అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా అని ప్రశ్నించారు.

అన్నా రాంబాబు, మాగుంట మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణమేంటి?