Nara Lokesh: ప్రజలారా.. జగన్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి: నారా లోకేశ్
భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తున్న నారాయణ అనే టీడీపీ అభిమానిపై దాడి చేయడం అమానవీయమన్నారు.

Nara Lokesh, CM Jagan Mohan Reddy
Nara Lokesh: ప్రజలారా జగన్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్లో పలు విషయాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
జగన్ అక్రమాస్తుల కేసుల మాఫీకోసం ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని వదులుకున్నారని నారా లోకేశ్ చెప్పారు. రుషికొండ కేసు నుంచి తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ అంశాన్ని విడిచిపెట్టారని తెలిపారు. బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు జగన్ పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు.
జగన్ సర్కారు వల్లే కృష్ణాజలాల కేటాయింపుల పునఃసమీక్ష జరుగుతోందని నారా లోకేశ్ విమర్శించారు. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా జలాలలో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని చెప్పారు.
పాదయాత్రగా వెళ్తున్న అభిమానిపై దాడి
ఓ వ్యక్తిపై దాడి జరిగిందంటూ నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు. ‘జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకీ అంటుకుంది. రాజ్యాంగవ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతూ, ప్రశ్నించే ప్రతిపక్షనేతల్నే కాకుండా ప్రజల్ని కూడా హింసిస్తూ సైకో జగన్ తన శాడిజం చూపిస్తున్నాడు. అధినేత చూపిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తున్న నారాయణ అనే టీడీపీ అభిమానిపై దాడి చేయడం అమానవీయం. వృద్ధుడు అని చూడకుండా దాడి చేశారంటే వీరు ముమ్మాటికీ వైకాపా సైకోలే’ అని లోకేశ్ అన్నారు.
Anil Kumar Yadav : నారాయణ బినామీ ఆస్తులపై ఆమెను విచారించాలి.. వాళ్ల దగ్గర వందలకోట్లు దోచుకున్నాడు