Narayana Brother Mani React : మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ ఆరోపణలు.. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన భర్త మణి

వారం రోజులుగా కొన్ని వీడియోలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేస్తున్నారని చెప్పారు. తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించడం అభ్యంతరకరంగా ఉందన్నారు.

Narayana Brother Mani React : మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ ఆరోపణలు.. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన భర్త మణి

Mani Priya's husband

Updated On : July 30, 2023 / 3:02 PM IST

Priya Allegations Agaist Narayana : ఏపీ మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన చేసిని విషయం తెలిసిందే. నారాయణ తనపై డేగ కన్నేశారని పేర్కొన్నారు. నారాయణపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచనలంగా మారాయి. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణపై మరదలు ప్రియ చేసిన ఆరోపణలపై ఆమె భర్త మణి స్పందించారు. తన భార్య ప్రియ గత కొంతకాలంగా మానిసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు.

క్యాన్సర్ వ్యాధికి కీమో థెరపీ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో యశోదా ఆస్పత్రిలో ఆమెకు సర్జరీ కూడా చేశారు. ఈ క్రమంలో ఆమె సైకాలజిస్టులు ఇచ్చిన మందులు వాడటం వల్ల ఒత్తిడికి గురై రకరకాల వీడియోలు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. వారం రోజులుగా కొన్ని వీడియోలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేస్తున్నారని చెప్పారు.

Electric Shock Student Died : ఖమ్మం జిల్లా నవోదయ విద్యాలయంలో విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి

తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించడం అభ్యంతరకరంగా ఉందన్నారు. తన భార్య ప్రియకు ట్రీట్ మెంట్ ఇప్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మానవతా దృక్పథంలో ఆలోచించి ఈ వీడియోలను పట్టించుకోవద్దని ప్రియ భర్త మణి విజ్ఞప్తి చేశారు.