simhachalam temple: సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం .. చైర్మన్ గా అశోక్ గజపతిరాజు
కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధరకర్మ పూసపాటి అశోక్ గజపతిరాజును

Simhachalam Temple
simhachalam temple : కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజును చైర్మన్ గా నియమించింది. మరో 14 మంది సభ్యులను నిర్వహిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేళ్ల కాల పరిమితితో నూతన పాలకవర్గం ఏర్పాటు కానుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింహాచలం ఆలయానికి చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించింది. 2020 మార్చి 3న సింహాచల ఆలయ ఛైర్‌పర్సన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజుతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే అప్పట్లో ఈ నియామకం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. ఉత్తర్వులు ఇచ్చిన మరుసటిరోజే చైర్ పర్సన్ గా సంచయిత బాధ్యతలు చేపట్టింది. అయితే తనను చైర్మన్ పదవి నుంచి తొలగించి సంచయిత నియామకాన్ని తప్పుపడుతూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా విచారించిన కోర్టు.. సుచరిత నియామకాన్ని రద్దు చేసి తిరిగి చైర్మన్ గా అశోక్ గజపతిరాజును నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు అశోక్ గజపతిరాజును కొనసాగిస్తూనే కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Ashok Gajapathi Raju : సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు
పాలకవర్గం సభ్యుల్లో సువ్వాడ శ్రీదేవి, పంచాడి పద్మ, వంకాయల సాయి నిర్మల, దశమంతుల రామలక్ష్మి, ఎం. రాజేశ్వరి, శ్రీదేవి వర్మ పెన్మత్స, బయ్యవరపు రాధ, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, దొడ్డి రమణ, గంట్ల శ్రీను బాబు, ఆర్. వీరవెంకట సతీష్, వారణాసి దినేశ్ రాజ్, కె. నాగేశ్వరరావులకు సభ్యులుగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే దినేశ్‌రాజ్ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు. దొడ్డి రమణ గాజువాక ప్రాంతంలో వైకాపా తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు.