ఒకసారి వారి దగ్గరకి వెళ్లండి.. మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు: జగన్

"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.

ఒకసారి వారి దగ్గరకి వెళ్లండి.. మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు: జగన్

Jagan

Updated On : December 4, 2025 / 12:36 PM IST

YS Jagan: ఎన్నికల ముందు రైతులకు ఏపీలోని కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇవాళ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

“రైతన్నా మీకోసం అని ప్రచారం చేస్తున్నారు.. రైతుల దగ్గరకి మీరెప్పుడు వెళ్లారు? ఒకసారి రైతుల దగ్గరకి వెళ్లండి తరిమి తరిమి కొడతారు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. ఇచ్చింది మాత్రం 10 వేలు మాత్రమే.

ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం మరీ దారుణం. ప్రభుత్వం ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. అతి తక్కువ ధరకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. దిత్వాహ్ తుపాన్ వస్తుందని 10 రోజుల ముందే తెలిసినా కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదు. రవాణా లేదు.. గన్ని బ్యాగ్స్ లేవు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడు లేడు.

Also Read: ఆల్‌ టైమ్‌ కనిష్ఠానికి రూపాయి.. అసలేం జరుగుతోంది? ఇలాగైతే ఎలా?

కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం. అసలు సీఎం ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సూపర్ సిక్స్ చేసేశామని చెప్పేస్తున్నారు? ఎక్కడ చేసేశారు? చంద్రబాబు గ్లోబల్స్ ని మించిపోయారు. గ్లోబల్స్ కే చంద్రబాబు టీచర్. సూపర్ సిక్స్ లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పింఛన్ ఎక్కడ? చంద్రబాబువి అన్ని 420 చేష్టలు.. చీటింగ్ కేసు పెట్టి జైలులో వెయ్యాలి.

రైతులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. రైతులు సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదు. మా పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయం ఇప్పుడు దండుగలా ఉంది. మొంథా తుపానుకు ఆర్టీజీఎస్ కి వెళ్లి చంద్రబాబు, లోకేశ్, పవన్ బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు ఆర్టీజీఎస్ లో కూర్చుని తుపానుని డైవర్ట్ చేసినట్టు ప్రచారం చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ ఒక్క పైసా సహాయం అందలేదు” అని అన్నారు.