Andhra Pradesh : ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్కడ సిగరెట్, పాన్‌ షాపులు క్లోజ్‌

విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్ లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

Andhra Pradesh : ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్కడ సిగరెట్, పాన్‌ షాపులు క్లోజ్‌

Andhra Pradesh (6)

Updated On : June 29, 2021 / 10:47 AM IST

Andhra Pradesh : విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్ లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశీలించే బాధ్యతను ఏఎన్ఎం లకు అప్పగించారు.

ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. ఏఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితిని ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. పాఠశాలల సమీపంలో పాన్ గుట్కా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇది పాఠశాల సమీపంలో సిగరెట్ తాగడాన్ని కూడా నిషేదించారు. మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో లేకుండా చేస్తున్నారు.

ఇక స్కూల్ ఆవరణలో పొగతాగడం వలన వచ్చే అనర్దాల గురించి చిత్రాలు, పోస్టింగ్స్ పెట్టనున్నారు. ప్రతి స్కూల్ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చెయ్యనున్నారు. వీటిని ఆన్లైన్ పోర్టల్ కు అనుసంధానిస్తారు.