అంబటి రాయుడు, హైపర్ ఆది, గెటప్ శీను.. జనసేన స్టార్ క్యాంపెయినర్లను నియమించిన పవన్ కల్యాణ్
నాగబాబు, అంబటి రాయుడు, జానీ (కొరియో గ్రాఫర్), సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శీను..

Pawan Kalyan
ఎన్నికల వేళ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. నాగబాబు, అంబటి రాయుడు (క్రికెటర్), జానీ (కొరియో గ్రాఫర్), సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శీను ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండనున్నారు. ఈ మేరకు జనసేన నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.
కాగా, తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళంతో పాటు వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడితో కలిసి పవన్ కల్యాణ్ ఇవాళ పాల్గొన్నారు. తణుకు టౌన్ నరేంద్ర సెంటర్లో ప్రజా గళం, నిడదవోలు గణేశ్ చౌక్ లో వారాహి విజయభేరి నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిిందే. ఇప్పటికే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి. ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. నామినేషన్ దాఖలు కి చివరి తేదీ ఏప్రిల్ 25. ఓటింగ్ మే 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెలువడతాయి.
Also Read: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్