Pawan Kalyan : నాకు అలాంటి అధికారులు అవసర్లేదు.. మరోసారి లంచం గురించి మాట్లాడిన డిప్యూటీ సీఎం..

తాజాగా లంచం గురించి పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడారు.

Pawan Kalyan : నాకు అలాంటి అధికారులు అవసర్లేదు.. మరోసారి లంచం గురించి మాట్లాడిన డిప్యూటీ సీఎం..

Pawan Kalyan

Updated On : October 20, 2024 / 10:52 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖపై బాగానే ఫోకస్ చేసారు. ఆ శాఖలకు మంత్రి కావడంతో ఆ శాఖలకు చెందిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. రోజూ అధికారులను కలుస్తూ పనులు చేయిస్తున్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో లంచంకు ఆస్కారం లేదని, ఇటీవల ఒకరు లంచం తీసుకుంటే ఆ అధికారిని సస్పెండ్ చేశామని అన్నారు.

Also Read : బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయం

తాజాగా లంచం గురించి పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడారు. జనసేన పార్టీ కార్యక్రమంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. లంచం అనే పేరు వినిపిస్తే వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. నాకు అలాంటి వ్యక్తులు, అలాంటి అధికారులు అవసర్లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పేషీలోఉన్న అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రజలకు చేయాల్సినవి ఏమి ఉన్నా మీరు మొహమాట పడకుండా సంబంధింత నాయకులకు, అధికారులకు కానీ, నా ఆఫీస్ దృష్టికి కానీ తీసుకొస్తే కచ్చితంగా వాటిని చేస్తాం. మనం ఇంత పోరాడి వస్తే అధికారులు కూడా కమిట్మెంట్ తో కూడా పనిచేస్తున్నారు. ఇది మన ప్రభుత్వం. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైనా మన దృష్టికి తీసుకువచ్చి చేయండి అని జనసేన నాయకులతో అన్నారు.

దీంతో పవన్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఇటీవలే లంచం గురించి మాట్లాడి మరోసారి ఇప్పుడు లంచం గురించి మాట్లాడి లంచం తీసుకునే అధికారులకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారని భావిస్తున్నారు. దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఇంత ఓపెన్ గా లంచం తీసుకునే అధికారులు అవసర్లేదు అని చెప్తుండటంతో నెటిజన్లు, ప్రజలు సైతం అభినందిస్తున్నారు.