Cm Chandrababu: 50ఏళ్లకే పెన్షన్, ఉచిత విద్యుత్, అదనంగా రూ.25వేలు.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు నిదర్శనం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్న చంద్రబాబు వారి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.

Cm Chandrababu: మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. మగ్గాలు, చేనేత వస్త్రాలను ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు దేశ సంపదలో భాగమన్నారు చంద్రబాబు. చేనేత పరిశ్రమపై చాలామంది ఆధారపడుతున్నారని తెలిపారు.
భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు నిదర్శనం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్న చంద్రబాబు వారి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. వైసీపీ హయాలో చేనేత పరిశ్రమ కుదేలైందని విమర్శించారు. చేనేత కార్మికులకు 50ఏళ్ల వయసు నుంచే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నేతన్న భరోసా కింద అదనంగా రూ.25వేలు సాయం అందిస్తామన్నారు. 50 శాతం సబ్సిడీతో మరమగ్గాలకు 80 కోట్లు ఖర్చు చేశామన్నారు చంద్రబాబు. ఈ నెల నుంచే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. చేనేతలకు నేతన్న భరోసా అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.
చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించాం. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించాం.
వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి మా ప్రభుత్వం ఎప్పుడూ మద్దతిస్తుంది. గతంలో 55వేల 500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాం. ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతాం. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.