Gudivada Amarnath : ప్రాజెక్టుల సందర్శన పేరుతో అల్లర్లకు చంద్రబాబు ప్లాన్.. పవన్ కు 10 ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్
పుంగనూరు ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. బ్రో సినిమా మొదటి రోజు సాయంత్రమే ఫ్లాప్ టాక్ వచ్చిందన్నారు. జగన్ రియల్ హీరో అని అందుకే 151 సీట్లు ఇచ్చారని తెలిపారు.
Gudivada Amarnath – Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అల్లర్లకు చంద్రబాబు (Chandrababu) ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ సిద్ధాంతాలు ఓకేలా ఉంటాయని విమర్శించారు. చంద్రబాబు సిద్ధాంతమే జనసేన సిద్ధాంతం అన్నారు. వాలంటీర్ వ్యవస్థను పవన్ అవమానించారని తెలిపారు. పుంగనూరు ఘటనలో 50 మందికి గాయాలయ్యాయిని తెలిపారు.
బ్రో సినిమా (BRO Movie) మొదటి రోజు సాయంత్రమే ఫ్లాప్ టాక్ వచ్చిందన్నారు. జగన్ రియల్ హీరో అని అందుకే 151 సీట్లు ఇచ్చారని తెలిపారు. పవన్ ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధిపై పవన్ కు ఉన్న ఆలోచన ఏమిటో చెప్పాలన్నారు. వారాహి వెబ్ సిరీస్ 3 గురువారం విశాఖలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Ambati Rambabu: పవన్ వదిలేశానని అంటుంటే.. మరి చిరంజీవికి ఎందుకు?
ఈ మేరకు మంత్రి గుడివాడ విశాఖలో మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే విశాఖ, 15 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే ముంబయి, 10 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే రష్యా అని ఎద్దేవా చేశారు. కాపు ఆడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు స్వాగతించ లేదని ప్రశ్నించారు.
గాజువాకలో ఓడిపోయారని యాత్ర చేస్తున్నారా అని అడిగారు. విశాఖ వేదికగా 175 సీట్లలో పోటీ చేస్తానని చెప్పగలరా అని నిలదీశారు. కనీసం ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నేతలు పేర్లు పవన్ కళ్యాణ్ కు తెలుసా అని అన్నారు. విశాఖ జనసేన జిల్లా అధ్యక్షుడు ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు.
Naga babu: ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు..: నాగబాబు సెటైర్లు
బ్రో సినిమా తుస్సు బ్రో అని ఎద్దేవా చేశారు. సినిమా బాగోలేక పోతే సొంత అభిమానులు కూడా చూడరని తెలిపారు. పవన్ రాజకీయాలు బాగోలేక పోతే అభిమానులు కూడా వెంట నడవరని పేర్కొన్నారు. 25 సీట్లలో పోటీ చేసి సీఎం అవుతారా అని ప్రశ్నించారు. విసన్న పేటలో ఒక సెంటు భూమి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు.
తనకు 600 ఎకరాలు భూమి ఉంటే దానిలో 10 శాతం భూమి తనకు ఇచ్చి మిగతా భూమి తీసుకోవచ్చన్నారు. విసన్నపేటలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు విజయనగరం పర్యటనలో 300 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు మంత్రి అమర్నాథ్ 10 ప్రశ్నలు సందించారు.
Yanamalakuduru: యనమలకుదురు హత్య కేసులో ట్విస్ట్.. ఆ మూడో వ్యక్తి ఎవరు?
పవన్ కళ్యాణ్ కు మంత్రి అమర్నాథ్ 10 ప్రశ్నలు
1 విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన పవన్ కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా?
2 ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ కు సొంత ఎజెండా ఉందా?
3 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదు
4 స్టీల్ ప్లంట్ పై కార్మికులకు ఒక క్లారిటీ ఇవ్వాలి
5 చంద్రబాబు పాలనలో 40 గుళ్ళు కులదొస్తే ఎందుకు నోరు మెదపలేదు
6 కమిషన్ కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరంను నాశనం చేస్తే ఎందుకు ప్రస్నిచలేదు
7 ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడం లేదు
8 ఉద్దనం కిడ్నీ సమస్యను పరిస్కరిస్తున్న సీఎం ను ఎందుకు అభినందించ లేక పోతున్నావు
9 వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన పవన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది
10 పోలీసు కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకొనే పవన్ 40 మంది పోలీసులకు గాయలైతే ఎందుకు స్పందించలేదు. తాము అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.