చంద్రబాబు ప్రజల కోసం పనిచేయడం లేదు : మోడీ 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 01:24 PM IST
చంద్రబాబు ప్రజల కోసం పనిచేయడం లేదు : మోడీ 

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల కోసం పని చేయడం లేదని ప్రధాని మోడీ విమర్శించారు. తన కొడుకు భవిష్యత్ కోసం పని చేస్తున్నారని తెలిపారు. కాకినాడలో బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మోడీ స్పందిస్తూ దాడులకు దిగుతున్నారు అంటే బీజేపీకి భయపడుతున్నట్లేనని అన్నారు. కార్యకర్తలు తలచుకుంటే బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు మోడీ. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అధిక నిధులు ఇచ్చిందని.. వాటిని టీడీపీ ఏం చేస్తుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలని ఆయన పిలుపు ఇచ్చారు.