ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

PM Modi

Updated On : June 10, 2024 / 10:56 PM IST

Pm Modi AP Tour : ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరుతారు.

ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటల 45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు ప్రధాని మోదీ.

అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి విజయవాడలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసరపల్లి ఐటీ పార్క్, గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు.

జూన్ 12న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. 17 ఎకరాల్లో విస్తీర్ణంలో సీనియర్ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. 60 మంది కూర్చునే విధంగా 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, ప్రజల కోసం 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న జర్మన్ హాంగర్స్ ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తరలి రానున్నారు.

Also Read : అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి నూతన కళ, మళ్లీ మహా నగర నిర్మాణ పనులు మొదలు