Bandaru Satyanarayana : టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్
సీఎం జగన్, మంత్రి రోజాను దూషించాలని బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. Bandaru Satyanarayana Arrest

Bandaru Satyanarayana Arrest
Bandaru Satyanarayana Arrest : హైడ్రామాకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉత్కంఠ నడుమ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలంలో బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 41ఏ, 41బీ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు బండారును అదుపులోకి తీసుకున్నారు.
కాగా, అనకాపల్లిలోని బండారు ఇంటి దగ్గర ఈ ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు బండారు ఇంటికి వెళ్లిన విషయం తెలిసి అక్కడికి టీడీకీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బండారు అరెస్ట్ ను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి.
బండారు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బండారును అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలు పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. సీఎం జగన్, మంత్రి రోజాను దూషించాలని బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్ టార్గెట్?
దాదాపు 13 గంటల ఉత్కంఠకు తెరపడింది. బండారును అరెస్ట్ చేస్తారని ఉదయం నుంచి కూడా వదంతులు వచ్చాయి. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బండారు ఇంటికి వచ్చారు. ఉదయం నుంచి బండారు సత్యనారాయణ సత్యమేవ జయతే దీక్ష చేశారు. పోలీసులు ఎవరూ లోపలికి రాకుండా తలుపులు బిగించుకున్నారు. చివరికి పోలీసులు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో బండారు కుమారుడు బండారు అప్పలనాయుడు కొంత మంది పోలీసులు లోపలికి రావాలని చెప్పారు.
గుంటూరు, అనకాపల్లి పోలీసులు లోపలికి వెళ్లారు. బండారుకి నోటీసులు ఇచ్చారు. రెండు కేసులు(సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని) నమోదు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి పోలీసులు బండారు సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. ఆరోగ్యం బాగోలేనందున బండారుని అక్కడే విచారించాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. అయితే అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. బండారును అరెస్ట్ చేసి గుంటూరుకి తరలించారు పోలీసులు.
Also Read..Botsa : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?