Vijayawada : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు దర్షిత్, శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష.. అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు
తెలుగుదేశం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ శ్రేణులను పోలీసులు పక్కకు తోసేసి దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Students Hunger strike
Vijayawada Students Hunger Strike : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ గత 4రోజులుగా విజయవాడ తెలుగుదేశం కార్యాలయంలో ఇద్దరు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇద్దరు విద్యార్థులు దర్షిత్, శ్రీనివాస్ ల చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి దాటాక పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమరణ నిరాహార దీక్ష చేసే సమయంలో పోలీసులకు, తెలుగుదేశం శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన తారకరత్న భార్యాపిల్లలు
తెలుగుదేశం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ శ్రేణులను పోలీసులు పక్కకు తోసేసి దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోట చేసుకుంది.