Kakani Govardhan Reddy : 12రోజులుగా పరారీలో మాజీమంత్రి కాకాణి.. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు..
విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy : వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
12 రోజులుగా మాజీ మంత్రి కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకి సమాచారం అందించారు. కాగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అటు క్వాష్ పిటిషన్ పై విచారణను రెండు వారాలకి వాయిదా వేసింది.
Also Read : కసిరెడ్డికి లిక్కర్ చక్కర్ తప్పదా.. కేసు ఎంత వరకు వచ్చింది?
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాలో మాజీమంత్రి కాకాణికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ ని విదేశాలకు ఎగుమతి చేసింది కాకాణి అండ్ బ్యాచ్. విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాలు సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. విచారణకు రావాలని పోలీసులు ఇప్పటికే మూడుసార్లు కాకాణికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు హైకోర్టులో కాకాణికి షాక్ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. క్వాష్ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు.
Also Read : కడప టీడీపీలో వర్గపోరు రాజుకుందా..? ఎందుకంటే?
కాకాణి అల్లుడు, కొందరు వైసీపీ నాయకులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒకసారి నెల్లూరులో, రెండుసార్లు హైదరాబాద్ లో కాకాణికి నోటీసులు జారీ చేసినా విచారణకు రాలేదు. 12 రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు.