మీరు, నేను ఇక్కడే చావాలె..పోలీసులతో బాబు

  • Published By: madhu ,Published On : January 12, 2020 / 11:09 AM IST
మీరు, నేను ఇక్కడే చావాలె..పోలీసులతో బాబు

Updated On : January 12, 2020 / 11:09 AM IST

మీరు, నేను ఇక్కడే చావాలె..మీ పిల్లలు ఇక్కడే చావాలె. మీరు కూడా ఆలోచించాలి..మంచి పద్ధతి కాదు..అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసులకు చెప్పారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం నరసరావుపేటకు బాబు వచ్చారు. గుంటూరు బై పాస్ రోడ్డులో బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిని ఎందుకు నిరాకరిస్తారంటూ ఫైర్ అయ్యారు. 

అంతకుముందు పార్టీ ఆఫీసు నుంచి బాబు కాన్వాయ్ రాగానే..మిగిలిన టీడీపీ శ్రేణుల బైక్‌లను నిలిపివేశారు. దీంతో వెంటనే కారు దిగి పోలీసులను ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే ర్యాలీకి అనుమతులిస్తున్నారు..తమకు ఎందుకివ్వరూ అంటూ పోలీసు అధికారిని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తున్నారు..ఇది మంచి పద్దతి కాదన్నారు. 

ఇళ్లకు ఫోన్ చేసి చెబుతారా ? ఇక్కడే పుట్టారు..ఇక్కడే ఉంటారు..మీరంత మీరు నాశనం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఏదో చెప్పారని చెత్తను మీద వేసుంటున్నారని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కావాలని చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. పోలీసు ఉద్యోగం తీసేస్తారా ? ఎవరికి రైట్ ఉంది..ఆలోచించాలన్నారు. రాష్టం, సమాజం ముఖ్యం, అధికారాలన్నీ తాత్కాలికమన్నారు బాబు. 

రాజధానిలో ఆందోళనలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆర్టీసీ పరిరక్షణ సమితి పేరిట నిరసనలు జరుగుతున్నాయి. వీరి ఆధ్వర్యంలో బాబు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జోలె పడుతూ..విరాళాలు సేకరిస్తున్నారు. ఆయా బహిరంగసభలో పాల్గొంటున్న బాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సందర్భంలో పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. 

Read More : సీఎం జగన్ నన్ను రోడ్డు మీద నిలబెట్టేలా చేస్తున్నారు – జేసీ