Power Crisis : దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్‌ను 15 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.

Ap Power
Power crisis in AP : బొగ్గు కొరత ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కమ్‌లు పనిచేస్తున్నాయని ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది. బొగ్గు కొరతతో.. ఏపీలో రెండు వేల 5 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో ప్లాంట్లు చేస్తున్నా.. అయితే బొగ్గు కొరత కారణంగా 2 వేల 500 మెగావాట్ల ఉత్పత్తి అవుతుందని తెలుస్తోంది.. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. బొగ్గు కొరత కారణంగా VTPS తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లోని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. అలాగే కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NTPC కూడా సామర్ధ్యం కంటే తక్కువ విద్యుత్‌నే ఉత్పత్తి చేస్తున్నాయని ట్రాన్స్‌కో తెలిపింది.
ఏపీ థర్మల్ పవర్ ప్రాజెక్టులకు ప్రతి రోజు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతోంది. కొరత కారణంగా…గత నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్‌ను 15 నుంచి 20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే
బొగ్గు కొరతతో కడపలోని RTPPలోని కొన్ని యూనిట్లను మూసేయాల్సి వచ్చిందని తెలిపింది ప్రభుత్వం… దీంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజూ 20 రైల్వే రేక్‌ల బొగ్గును కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను ఆదేశించాలని కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం… PPAలు, బొగ్గు అనుసంధానం లేకపోవటంలో నిలిచిపోయిన పిట్ హెడ్ థర్మల్ ప్లాంట్లకు అత్యవసర ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలంది.
మరోవైపు బొగ్గు నిల్వలను పెంచుకోవటంపై జెన్‌కో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విజయవాడలోని VTPS దగ్గర 21 వేల 177 టన్నులు, కడపలోని రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు దగ్గర 69 వేల 813 టన్నులు, కృష్ణపట్నంలో 93వేల 789 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి వీటీపీఎస్‌కు 16 సుమారు 60 వేల టన్నులు, ఆర్‌టీపీపీకి 35 వేల టన్నుల బొగ్గు వస్తోంది. కృష్ణపట్నం ప్లాంటుకు 72 వేల టన్నుల బొగ్గు సముద్ర మార్గంలో వస్తోంది. మరో 70 వేల టన్నులను లోడింగ్‌కు ఉంచుతున్నారు.