లెనిన్‌కు మన ప్రాంతానికి ఏంటి సంబంధం..? విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలి.. బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

PVN Madhav
PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో మాజీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి మాధవ్‌కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అనంతరం మాధవ్ ఏపీ నూతన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల సమన్వయంపై కీలక కామెంట్స్ చేశారు.
Also Read: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..
పార్టీలో అందరినీ కలుపుకొని ముందకెళ్తానని మాధవ్ అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరి నేతలతో చర్చించి తీసుకుంటా. పార్టీ బలోపేతానికి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటా. కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పారు. కూటమి పార్టీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలిపారు.
లెనిన్ సెంటర్ పేరు మార్చాలి..
విజయవాడలో లెనిన్ సెంటర్‌కు విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ అన్నారు. లెనిన్ కు మన ప్రాంతానికి ఏంటి సంబంధం..? భారత దేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 9, 2025