Raghu Rama KrishnaRaju: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. అజ్ఞాతంలోకి డాక్టర్ పద్మావతి..!
టీడీపీ ఎమ్మెల్యే రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతిని అరెస్ట్ చేసేందుకు ..

RaghuRama Krishna Raju
Raghu Rama KrishnaRaju: టీడీపీ ఎమ్మెల్యే రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతిని అరెస్ట్ చేసేందుకు విచారణ అధికారి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, ఆమె పోలీసుల కల్లుగప్పి విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పద్మావతి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేసేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకిదిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని నాలుగు సార్లు ఆమె ఇంటికివెళ్లి పోలీసులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయినా పోలీసు విచారణకు పద్మావతి హాజరుకాలేదు.
Also Read: CM Chandrababu Naidu: కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇలా..
పద్మావతి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆమె నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా.. ఈనెల 10న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రఘు రామరాజు కస్టోడియల్ సమయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అభియోగంలో శరీరంపై ఎటువంటి గాయాలు లేవని డాక్టర్ పద్మావతి తప్పడు నివేదిక ఇచ్చారని ఆభియోగాలున్నాయి.
Also Read: AP Liquor Sales : సంక్రాంతికి ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..
రఘు రామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సీఐడీ విభాగపు మాజీ ఏఎస్పీ విజయ్ పాల్, కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరుడిగా కొనసాగిన తులసి బాబు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. తులసిబాబు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు.