Red Mango :కశ్మీర్ యాపిల్‌లా నోరూరించే ‘రెడ్ మ్యాంగో’..టేస్ట్ సూపర్..
కశ్మీర్ యాపిల్ లాంటి రంగుతో... అద్భుతమైన రుచితో ఉండే మామిడిపండ్లు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే మన దేశంలో ఈ రెడ్ మ్యాంగోస్ కొంచెం అరుదుగానే దొరుకుతాయి. అలాంటి రేర్ రెడ్ మ్యాంగో ఇప్పుడు ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో దొరుకుతోంది.

Red Mango (1)
JAPAN Red MANGO : పసుపు పచ్చని రంగుతో నిగనిగలాడే మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా… అన్నింటికీ రారాజు మామిడిపండే. ఇండియాలో మనకు చాలా రకాల మామిడిపండ్లు దొరుకుతాయి. రుచి, ఆకారంలో చిన్న చిన్న తేడాలు ఉన్నా… అన్నీ దాదాపుగా ఒకే రంగుతో ఉంటాయి. కానీ కశ్మీర్ యాపిల్ లాంటి రంగుతో… అద్భుతమైన రుచితో ఉండే మామిడిపండ్లు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
రెడ్ మ్యాంగో..! అచ్చం కశ్మీర్ యాపిల్‌లా నోరూరిస్తుంది..! దీని టేస్ట్ అంతకుమించి ఉంటుంది. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఇప్పటి వరకు మనం చూసిన, తిన్న మామిడి పండ్లు వేరు.. ఈ రెడ్ మ్యాంగో వేరు..! దీని అద్భుతమైన రుచి ఎంత తిన్నా..ఇంకా తినాలనిపిస్తునే ఉంటుంది. కాకపోతే మన దేశంలో ఈ రెడ్ మ్యాంగోస్ కొంచెం అరుదుగానే దొరుకుతాయి. అలాంటి రేర్ రెడ్ మ్యాంగో ఇప్పుడు ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో దొరుకుతోంది.తెలంగాణలోని నర్సాపూర్నర్సరీలో రెడ్ మ్యాంగో మామిడి రకాన్ని చూసిన ప్రకాశం జిల్లా రైతు వెంకటేశ్వరరావు వాటిని తెచ్చి తన తోటలో నాటారు. ఆ మొక్కలే కొన్నేళ్లకు చెట్లుగా ఎదిగి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. ఇక్కడ గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న రెడ్ మ్యాంగోస్‌ని చూస్తుంటేనే నోరూరిస్తున్నాయి.
రెడ్ మ్యాంగోస్ ఎక్కువగా జపాన్‌లో పండుతాయి. ఇవి ఎలానో ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఈ మామిడి రకాన్ని సాగు చేస్తున్నారు. దీనిలో ఉన్న మరో విశేషం ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉండి.. ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. ఈ రెడ్ మ్యాంగ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీల వరకు దిగుబడి ఇస్తుంది. రెడ్ మ్యాంగోలో మంచి పోషకాలు ఉండడంతో దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మామిడి రకాలతో పోల్చితే ఈ రెడ్ మ్యాంగో కాస్ట్ కూడా ఎక్కువే. అందుకే.. దిగుబడి తక్కువైనా.. లాభం మాత్రం ఎక్కువే అంటున్నారు.
ఈ మామిడి పండ్ల సాగు చేసే సమయంలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి పంట సాగుకు ఉపయోగిస్తున్నారు రైతు వెంకటేశ్వరరావు. ఇక్కడ కనిపిస్తున్న మామిడి సాగు మొత్తాన్ని ఇలానే సాగు చేశారు. రెడ్ మ్యాంగో సాగులో ఎలాంటి రసాయనాలు వాడకపోవడంతో.. దీనికున్న డిమాండ్ మరింతగా పెరుగుతోంది. అయితే భవిష్యత్తులో ఈ పంట దిగుబడి మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలంటే.. మీరూ ఓసారి ఈ రెడ్ మ్యాంగోని టేస్ట్ చేయండి.