RTC Bus Overturn : ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. బైక్ ను తప్పించబోయి పంట కాలువలోకి..

ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.

RTC Bus Overturn : ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. బైక్ ను తప్పించబోయి పంట కాలువలోకి..

RTC bus overturn

Updated On : December 18, 2022 / 10:44 AM IST

RTC Bus Overturn : ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నందిగామలంక నుంచి గుడివాడకు వెళ్తోంది.

బస్సు మార్గంమధ్యలో ఎంగిలిపాకలంక గ్రామ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.