Sajjala Ramakrishna Reddy : మాది బలమైన పార్టీ, ఇలాంటివి సహజమే, ముందే ప్లాన్ చేసుకున్నారేమో- యార్లగడ్డ ఆరోపణలకు సజ్జల కౌంటర్

ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి అందరికీ అవకాశాలు రావని చెప్పారు. పార్టీ కోసం పని చేస్తే వేరే అవకాశాలు వస్తాయన్నారు. Sajjala Ramakrishna Reddy - Gannavaram

Sajjala Ramakrishna Reddy : మాది బలమైన పార్టీ, ఇలాంటివి సహజమే, ముందే ప్లాన్ చేసుకున్నారేమో- యార్లగడ్డ ఆరోపణలకు సజ్జల కౌంటర్

Sajjala Ramakrishna Reddy

Updated On : August 18, 2023 / 5:31 PM IST

Sajjala Ramakrishna Reddy – Gannavaram : వైసీపీకి గుడ్ బై చెబుతూ గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో కలకలం రేపాయి. తడిగుడ్డతో నా గొంతు కోశారు,  ఎన్నో అవమానాలకు గురి చేశారు అంటూ వైసీపీ అధిష్టానంపై యార్లగడ్డ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం దుమారం రేపింది. యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపణలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వెంకట్రావ్ చేసిన అలిగేషన్స్ ను ఆయన ఖండించారు.

ఏ పార్టీలో అయినా ఎన్నికల సమయంలో పోటీ చెయ్యాలని ఆశావహులు ఉంటారు, యార్లగడ్డ కూడా అలానే అనుకున్నారు అని సజ్జల అన్నారు. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి అందరికీ అవకాశాలు రావని చెప్పారు. పార్టీ కోసం పని చేస్తే వేరే అవకాశాలు వస్తాయన్నారు. వైసీపీ లాంటి బలమైన పార్టీలో పోటీ చెయ్యాలని ఆశగా ఉండటం సహజమే అన్నారు. అవమానపరచడం, బాధ పెట్టడం అనేవి వైసీపీలో ఉండవన్నారు.

Also Read..Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..

యార్లగడ్డకు బాధ ఉంటే వచ్చి మాట్లాడాలి, ఇలాంటివి పార్టీలో ఇంటర్నల్ గా చర్చలు జరగాలని సజ్జల వ్యాఖ్యానించారు. ఇంతకుముందు మాతో వచ్చి మాట్లాడారు, ఇప్పుడెందుకు రాలేదు? అని ఆయన యార్లగడ్డను ప్రశ్నించారు. వరుస మీటింగ్స్ పెట్టి బహిరంగంగా ఉద్దేశ్యాలు చెప్పడం కరెక్టు కాదన్నారు.

పార్టీ వీడాలని యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకుని ఈ మీటింగ్స్ పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్చ ఉంటుందన్న సజ్జల ఎవరి నిర్ణయాలు వాళ్ళవని చెప్పారు. పోతే పో అని నేను అనలేదు, మీడియా వక్రీకరించిందని సజ్జల వివరించారు. యార్లగడ్డ.. చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని మేము అనలేదని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే పార్టీ నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదన్నారు. 2019లో పోటీ చేసి కష్టపడ్డావు, మంచి ఫ్యూచర్ ఉంటుందని యార్లగడ్డకు చాలాసార్లు చెప్పామన్నారు. యార్లగడ్డ వెంకట్రావ్.. సీఎం అపాయింట్ మెంట్ అడిగారో లేదో మాకు తెలీదని సజ్జల చెప్పారు.

Also Read..Botsa Family : చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి.. ఎంపీగా పోటీ చేస్తారా?