సీఎం కార్యాలయంలోకి వెళ్లిన కంటైన‌ర్‌పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏమన్నారంటే?

కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సీఎం కార్యాలయంలోకి వెళ్లిన కంటైన‌ర్‌పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏమన్నారంటే?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండుగా కనిపించాయని, మంచి చేస్తే ప్రజలు ఇలా గుర్తు పెట్టుకుంటారని రుజువైందని, రానున్న రోజుల్లో మరింతగా ప్రజల ఆశీర్వాదం పెరుగుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాలేదు.. మళ్లీ అవే మోసపు మాటలు చెబుతున్నాడు. తనకున్న అవలక్షణాలు జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించాలని చూస్తున్నాడు అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read : ఏపీ బీజేపీలో రాజుకున్న అసెంబ్లీ సీట్ల చిచ్చు .. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన

సీఎం కార్యాలయంకు వచ్చిన కంటైనర్ కు ఎన్నికల సంఘం అనుమతి ఉందని సజ్జల చెప్పారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసీ నుండి కంటైనర్ తీసుకున్నాం. కంటైనర్ లో ఏదో ఉంది అని దివాలాకోరు తనంతో మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి ఏమీలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల పద్దతి చూస్తుంటే పార్టీ ఆఫీస్ లో కూడా ఏదో ఉంది అంటూ యాగి చేస్తారంటూ సజ్జల విమర్శించారు.

Also Read : చంద్రబాబు కామెంట్స్.. కొడాలి నాని కౌంటర్

ఢిల్లీలో కాళ్లు పట్టుకుని.. ఇక్కడ మాత్రం వాళ్లే పొత్తుకు వచ్చారు అంటూ సిగ్గులేకుండా చంద్రబాబు చెబుతున్నాడని సజ్జల అన్నారు. కేసుల నుండి బయటపడేందుకు బీజేపీతో పొత్తుకోసం తిరిగింది నిజంకాదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులు టీడీపీ వ్యక్తులే. నరసాపురం మినహా ఎంపీ అభ్యర్థులంతా చంద్రబాబు డిసైడ్ చేసిన వాళ్లే. బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్ల ద్వారా ఇదంతా చేశారు. కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా వైసీపీ వైపు వస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాటకానికి మిగిలిన పార్టీలు బలి అయ్యాయి.. జాతీయ పార్టీలుసైతం చంద్రబాబు నాటకంలో పడ్డాయని సజ్జల అన్నారు.

వృద్ధుల పెన్షన్ 4వేలు కాదు.. నలబై వేలు అనికూడా చంద్రబాబు చెప్తాడు.. ఎందుకంటే.. చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏమి చెప్పినా నకిలీనే. చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థ పోతుంది. జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబువస్తే పథకాలు ఆగిపోతాయని ప్రజలకు తెలుసని సజ్జల అన్నారు.