Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ గర్వకారణం: సజ్జల

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి 200 కోట్ల రూపాయలు అవుతాయనుకున్నామని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఇప్పుడు రూ.400 కోట్లకి ఖర్చు పెరిగిందని తెలిపారు.

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ గర్వకారణం: సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy – YSRCP: విజయవాడ (Vijayawada) నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ గర్వకారణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

అంబేద్కర్ స్మారకార్థం స్మృతివనం పనులు 20 ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇవాళ అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించామని తెలిపారు. అసమానతలపై పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా పటిష్ఠమైనదని చెప్పారు.

అన్ని వర్గాల వారికీ అంబేద్కర్ ఆదర్శమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేద్కర్ ని కీర్తించడానికి ఇంతకంటే మంచి ప్రాంతం ఎక్కడ అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ, సీఎం వైఎస్ జగన్ హృదయంలో అంబేద్కర్ స్థానమేంటో చెప్పడానికి ఈ స్మృతివనం ఉదాహరణ అని అన్నారు.

దేశమంతా గర్వించేలా ఈ స్మృతివనం పనులు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2016 లో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎటువంటి పనులూ చేయలేదని అన్నారు. అంబేద్కర్ పై జగన్ కి ఉన్న గౌరవానికి నిదర్శనమే ఈ స్మృతివనమని చెప్పారు.

రూ.200 కోట్లు అవుతాయనుకున్నాం..
అంబేద్కర్ స్మృతివనం పనులను ప్రభుత్వ సలహాదారు సజ్జల పరిశీలించారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నగరం‌ నడిమధ్యలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్ర పుటల్లో లిఖించే రోజని చెప్పారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి 200 కోట్ల రూపాయలు అవుతాయనుకున్నామని చెప్పారు.

ఇప్పుడు రూ.400 కోట్లకి ఖర్చు పెరిగిందని తెలిపారు. ఇంకా ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధమేనని చెప్పారు. త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు.

Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి నేను రాజీనామా చేయలేదు.. కానీ..: కిషన్ రెడ్డి