Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి నేను రాజీనామా చేయలేదు.. కానీ..: కిషన్ రెడ్డి
అనారోగ్య కారణంగానే కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నానని తెలిపారు.

Kishan Reddy
Kishan Reddy – BJP: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలంగాణ (Telangana) పర్యటన ముగిసిన అనంతరం జులై 8న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర అగ్ర నేతలను కిషన్ రెడ్డి కలుస్తారు.
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు కొనసాగుతానని వివరించారు.
తమ పార్టీ ఏ ఆదేశాలిస్తే వాటిని పాటిస్తానని అన్నారు. తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి ఇస్తారని అనుకోలేదని చెప్పారు. తాను అనారోగ్య కారణంగానే కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నానని తెలిపారు.
బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవే ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్ణయానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనని తెలిపారు. కాగా, తెలంగాణ ఎన్నికల ముందు బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Rahul Gandhi: గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన.. రాహుల్ గాంధీ ఆగ్రహం