SIT Report : అంతా వారివల్లే..! ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం
సిట్ అధికారులు పల్లాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. మాచర్ల, గురజాడ, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం దర్యాప్తు చేసింది.

SIT Preliminary Report
SIT Investigation Report : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల తరువాత జరిగిన అల్లర్లపై విచారణకు 13మంది సభ్యులతో సిట్ బృందాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. ఈ బృందం రెండు రోజులుపాటు ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించి నివేదికను తయారు చేసింది. క్షేత్రస్థాయిలో విచారణపై సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఇవాళ డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ అందించనున్నారు. మధ్యాహ్నంకు సీఎస్ ద్వారా సీఈవో, సీఈసీకి ప్రాథమిక నివేదికను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ బృందం మరికొన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉంది.
Also Read : SIT On Poll Violence : ఏపీలో ఎన్నికల హింసపై 13మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే
సిట్ అధికారులు పల్లాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. మాచర్ల, గురజాడ, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం దర్యాప్తు చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండోరోజు సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగింది. కారంపూడిలో పర్యటించిన సిట్ బృందం.. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారంపూడి సీఐ నారాయణ స్వామి నుంచి వివరాలను సేకరించిన సిట్ బృందం.. టీడీపీ, వైసీపీ ఫిర్యాదులపై ఆరా తీసింది.
Also Read : ఏపీలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటన.. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు వేగవంతం
నర్సరావుపేటలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం విచారణ చేపట్టింది. సిట్ బృందంకు సత్తెనపల్లి రూరల్ సీఐపై మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి ఘటనపైనా సిట్ విచారణ చేపట్టింది. చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో పర్యటించిన సిట్ అధికారులు.. ఘర్షణలపై పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. కూచివారిపల్లిలో ధ్వంసమైన వైసీపీ నేత ఇంటిని పరిశీలించారు. ఆ రాత్రి గొడవల్లో దగ్దమైన వాహనాలను పరిశీలించారు. అంతకుముందు తిరుపతి పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ప్రాంతాన్ని సిట్ బృందం పరిశీలించింది. పులివర్తి నానిపై దాడికి ఉపయోగించిన కత్తులు, రాడ్లు, ఇతర మారణాయుధాలను పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంలో సిట్ బృందం సీన్ రీక్రియేట్ చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. ఘర్షణకు సంబంధించి సీసీ పుటేజీలను పరిశీలించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో వైసీపీ లీగల్ సెల్ సభ్యులు సిట్ బృందాన్ని కలిశారు. తమ ఇంట్లో పోలీసులు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన సీసీ పుటేజిలను సిట్ అధికారులకు ఇచ్చారు.
Also Read : India Economy Growing : ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయం!
రెండురోజుల పాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సిట్ బృందాలు పరిశీలించాయి. పోలీసుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ బృందం ప్రాథమిక నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మరికొంత సమయాన్ని బృందం ఈసీని కోరే అవకాశం ఉంది.