Stick Fighting : దేవరగట్టు కర్రల సమరం.. చూసేందుకు వస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు 3 రాష్ట్రాల ప్రజలు

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.

Stick Fighting : దేవరగట్టు కర్రల సమరం.. చూసేందుకు వస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు 3 రాష్ట్రాల ప్రజలు

Devaragattu Stick fighting

Updated On : October 24, 2023 / 11:18 PM IST

Devaragattu Stick Fighting : కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం అర్ధరాత్రి సమయంలో జరగనుంది. మరి కొన్ని గంటల్లో కర్రల సమరం ప్రారంభం కాబోతుంది. దేవరగట్టుకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. కర్రల సమరం వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రజలు చేరుకుంటున్నారు.

చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ గ్రామాల నుండి దేవరగట్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.

Durga Procession: నిమజ్జనం చేస్తుండగా బ్రేకులు ఫెయిలై నేరుగా వెళ్లి నదిలో పడ్డ ట్రక్కు

ఫ్లడ్ లైట్స్, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలను పోలీస్, రెవిన్యూ అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఘర్షణలో గాయపడిన వారికి కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్యశాలలను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా దేవరగట్ట కర్రల సమరాన్ని జిల్లా పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.