Supreme Court : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.

Supreme Court (2)
Supreme Court : వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తునకు నష్టం కలిగిస్తాయని తెలిపింది. సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు రెండు నెలలు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు సీబీఐ విచారణ గడువు ఇచ్చింది.
వైఎస్ వివేక హత్య కేసులో ఏప్రిల్30 వరకు సీబీఐ విచారణ గడువు ముగియనుండటంతో ఈ గడువును రెండు నెలలు పెంచింది. సీబీఐ విచారణ గడువును జూన్ 30 వరకు పెంచింది. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులను జారీ చేసిందని భావిస్తున్నామమని సీజేఐ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు.
YS Viveka Case: వైఎస్ వివేకా కేసు విచారణలో కొత్త కోణం
దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టు జూన్ 30 వరకు సీబీఐ దర్యాప్తు గడువు పెంచింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సీజేఐ ధర్మాసనం కొట్టివేసింది. దీంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐకి లైన్ క్లియర్ అయింది.
సునీత పిటిషన్ పై సీజేఐ ధర్మాసనం సుదీర్ఘమైన తీర్పును ఇచ్చింది. సునీతకు అనుకూలంగా సీజేఐ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపింది. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది.
chandrababu: వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోతున్నారు: చంద్రబాబు
సుమారు అర్ధగంటపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. ఇటు సీబీఐ అటు సునీత, అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు వినిపించారు. ప్రధానంగా సోమవారం జరిగిన విచారణలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అవినాశ్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తుర్వులను పక్కనపెట్టారు. అవినాశ్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.