ఏపీ వెళ్లేందుకు చంద్రబాబుకు పర్మిషన్ వచ్చేసింది

ఎట్టకేలకు ఏపీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పర్మిషన్ వచ్చింది. ఏపీ డీజీపీ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్దాయి. డీజీపీ పర్మిషన్ ఇవ్వడంతో రేపు విశాఖలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా అమరావతిలోని నివాసానికి వెళ్లనున్నారు.
రేపు ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లనున్నారు. ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభావితమైన గ్రామంలో బాధితులను పరామర్శించనున్నారు. అమరాతి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో ఉత్కంఠ నెలకొంది. గత విశాఖ పర్యటనలో ఎలాగైతే వైసీపీ శ్రేణులు అడ్డుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి గతంలో ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏర్పడుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈక్రమంలో చివరి వరకు తర్జనభర్జన పడినప్పటికీ చివరికి చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతించారు.