ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టు..!

కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కార్ లో తమకు 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టు..!

Chandrababu Naidu : మరోసారి ఎన్డీయేలో కింగ్ మేకర్ కానున్నారు చంద్రబాబు నాయుడు. బంపర్ మెజార్టీతో గెలిచిన చంద్రబాబు ఎన్డీయేలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంది టీడీపీ. దీంతో త్వరలో కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కార్ లో తమకు 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. కీలక మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్.

ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ కూటమి కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతోంది. ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషించడానికి చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతారు. కేంద్రంలో ఈసారి కింగ్ మేకర్ గా వ్యవహరించే అవకాశం చంద్రబాబుకి ఉంది. ఏపీ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ కూటమి.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే కచ్చితంగా టీడీపీ ఎంపీల అవసరం ఉంది.

చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంతో కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి పదవికి ఎవరి పేరుని ప్రపోజ్ చేయాలి? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు ఏంటి? ఇవన్నీ తేల్చుకోవడానికి చంద్రబాబుకి మరొకసారి అవకాశం వచ్చింది.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మోదీకి ఏపీ అవసరం చాలా ఉంది. టీడీపీకి దక్కిన అత్యధిక మెజార్టీ స్థానాల అవసరం కూడా మోదీ సర్కార్ కు ఉంది. రాష్ట్ర విభజన అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు.. అవన్నీ సాధించుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండాల్సిందే. కీలకమైన శాఖలను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. 3 నుంచి 5 శాఖలు కోరే ఛాన్స్ ఉంది. టీడీపీకి 3 నుంచి 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ శాఖలు కేటాయిస్తారు? ఎన్ని కేబినెట్ పదవులు ఇస్తారు? ఎన్ని సహాయమంత్రి పదవులు కేటాయిస్తారు? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ చాలా కీలకమైన పాత్రమైన పోషించబోతోంది అన్నది సుస్పష్టం.

Also Read : వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు