Muddaraboina Venkateswara Rao : కన్నీళ్లు పెట్టుకున్న నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

Muddaraboina Venkateswara Rao : ఈసారి నూజివీడులో మాజీ మంత్రి పార్థసారిథిని పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముద్దరబోయినను టీడీపీ అధిష్టానం పిలిపించి బుజ్జగించినట్టు తెలుస్తోంది.

Muddaraboina Venkateswara Rao : కన్నీళ్లు పెట్టుకున్న నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

TDP Incharge Muddaraboina Venkateswara Rao Gets Emotional

Updated On : February 17, 2024 / 11:51 PM IST

Muddaraboina Venkateswara Rao : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. శనివారం నూజివీడులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గత రెండు సందర్భాల్లో ఓడిపోయిన టీడీపీ కోసం పనిచేశానని, ఇప్పుడు అభ్యర్థి మార్పు అంటూ ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : HarishRao Comments : ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకనే కాళేశ్వరం పేరిట గారడీలు : హరీష్ రావు మండిపాటు

ఈసారి నూజివీడులో మాజీ మంత్రి పార్థసారిథిని పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ముద్దరబోయినను టీడీపీ అధిష్టానం పిలిపించి బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మీయ సభలో భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.

త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా :
పదేళ్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని ఆయన తేల్చిచెప్పారు. గెలుపు టీడీపీదేనని.. ప్రజల మాట, అధిష్టానం నిర్ణయంపై కార్యకర్తలు చెప్పే మాట తాను ఆచరిస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

Read Also : Minister Sridhar Babu : చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది.. 3 బిల్లులను ఆమోదించాం : మంత్రి శ్రీధర్ బాబు