డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే కొండపైకి అనుమతి..! వైఎస్ జగన్ తిరుమల టూర్ పై రాజకీయ రగడ

జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే కొండపైకి అనుమతి..! వైఎస్ జగన్ తిరుమల టూర్ పై రాజకీయ రగడ

Ys Jagan

Updated On : September 26, 2024 / 9:29 PM IST

Ys Jagan Tirumala Tour : వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై రాజకీయ రగడ ముదురుతోంది. జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ స్టంట్ అని టీడీపీ విమర్శిస్తోంది. డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ తిరుమల టూర్ పొలిటికల్ స్టంట్- మంత్రి పయ్యావుల కేశవ్..
” శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడింది నిజం. దాన్ని ఉపయోగించింది నిజం. అపచారం జరిగింది నిజం. జగన్ చెబుతున్న మాటలు అబద్ధం. జగన్ ఓ అబద్ధం. ఇక రేపు జగన్ చేయమంటున్న పూజలు కూడా అబద్ధమే. అదొక పొలిటికల్ ఈవెంట్. ఈ పొలిటికల్ ఈవెంట్ ను దయచేసి మానేయాలి”.

డిక్లరేషన్ పై సంతకం చేశాకే దర్శనం చేసుకోవాలి- బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి
”ఏమీ తెలియదన్నట్లు జగన్ స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం. స్వామి వారి పవిత్రతను దెబ్బతీసేలా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడేలా, బాధపడేలా వ్యవహరించిన జగన్.. హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కొండపైకి అడుగుపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు అన్యమతస్తులు ఎవరు తిరుమలకు వచ్చినా డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే. స్వామి వారిని నేను నమ్ముతున్నాను, స్వామి వారిపై భక్తితో దర్శనానికి వస్తున్నాను అని చెప్పి డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన సాంప్రదాయం ఉంది. దానిపై సంతకం చేసిన తర్వాతే అలిపిరిలో అడుగు పెట్టాలి. లేకపోతే గరుత్ముంతుడు దగ్గరే అడ్డుకుంటామని జగన్ ని బీజేపీ హెచ్చరిస్తోంది.

Also Read : 3 నెలల తర్వాత సడెన్‌గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?

జగన్ ఏనాడైనా ఫ్యామిలీతో తిరుమలకు వచ్చారా?- కిరణ్ రాయల్, జనసేన నేత..
డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని జగన్ స్టేట్ మెంట్ ఇవ్వాలి. జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. ఏరోజు అడిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ అధికారి మిమ్మల్ని ప్రశ్నించలేదు. కానీ, ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి తిరుమలకు వచ్చే ముందు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెడతారో లేదో చెప్పి రావాలి. డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టకుండానే తిరుమలకు వస్తాను, ఏమవుతుందో చూద్దాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తీసుకొద్దాం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.