TDP Pattabhi Ram: గన్నవరం కోర్టుకు టీడీపీ నేత పట్టాభి.. కోర్టుకు తరలిస్తుండగా టీడీపీ నేతల ఆందోళన, ఉద్రిక్తత

టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు పోలీసులు.

TDP Pattabhi Ram: గన్నవరం కోర్టుకు టీడీపీ నేత పట్టాభి.. కోర్టుకు తరలిస్తుండగా టీడీపీ నేతల ఆందోళన, ఉద్రిక్తత

Updated On : February 21, 2023 / 4:42 PM IST

TDP Pattabhi Ram: కృష్ణా జిల్లా గన్నవరంలో మంగళవారం మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు పోలీసులు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ప్రత్యేక వాహనంలో, భద్రత మధ్య గన్నవరం కోర్టుకు తీసుకెళ్లారు. వారిని కోర్టుకు తీసుకెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అక్కడ ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం వారిని భద్రత మధ్య కోర్టుకు తీసుకెళ్లారు. మొత్తం 15 మంది టీడీపీ నేతలను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వద్ద కూడా ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

బస్సులో వెళ్తున్న సమయంలో పోలీసులు తనను కొట్టారని చేతులు చూపించిన పట్టాభి. చేతులు వాచినట్లు సైగలు చేస్తూ పట్టాభి కోర్టులోకి వెళ్లాడు. అక్కడ విచారణ కొనసాగుతోంది. అంతకుముందు పట్టాభి సహా టీడీపీ నేతలకు పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.