జనసేన గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. భీమవరం నుంచి బరిలోకి..!

రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.

జనసేన గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. భీమవరం నుంచి బరిలోకి..!

Pulaparthi Anjibabu : టీడీపీ నేత, భీమవారం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జనసేన గూటికి చేరనున్నారు. రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పవన్ తో సమావేశమైన పులపర్తి అంజిబాబు భీమవరం నుంచి బరిలోకి దిగనున్నారు. అంజిబాబు రేపు మంగళగిరి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు.

భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటివరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భీమవరం నుంచి పవనే పోటీ చేస్తున్నారు, గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని కొంతకాలంగా జనసైనికులు సైతం ప్రచార కార్యక్రమాలు చేశారు. ఇటీవల భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు టీడీపీ నేత సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు, అలాగే బీజేపీ నేత సత్యనారాయణ ఇళ్లకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇదే సందర్భంలో వివిధ రాజకీయ కారణాలతో భీమవరం నుంచి బరిలోకి దిగేందుకు పులపర్తి రామాంజినేయులును జనసేనాని పవన్ ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే అంజిబాబు పవన్ తో భేటీ కావడం జరిగింది. అంజిబాబే భీమవరం నుంచి పోటీ చేస్తారని సూచనప్రాయంగా పార్టీ నేతలకు కూడా తెలపడం జరిగింది. జనసేన నేతలు అంజిబాబు రాకను వ్యతిరేకించారు కూడా. ఆయనకు సహకరించేది లేదన్నారు. గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడానికి కూడా పరోక్షంగా పులపర్తి అంజిబాబే కారణం అనేది జనసేన నేతలు అంతా పవన్ కు వివరించారు.
అయినప్పటికీ పొత్తులో భాగంగా అంజిబాబుకే జనసేన టికెట్ ఖరారు చేసిట్లుగా పార్టీ నేతలకు తెలిపారు పవన్ కల్యాణ్. ఇంకా జనసేన కండువా కూడా కప్పుకోకుండానే.. భీమవరం జనసేన టికెట్ అంజిబాబుకు కేటాయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు అంజిబాబుకు సహకరించాలని జనసేన నేతలు, శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్.

Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?