Andhra Pradesh : విశాఖలో కాపురం పెడతానంటున్నావు ఎవరిని ఉద్ధరించటానికి : యనమల సెటైర్లు

విశాఖలో రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు యనమల.

Andhra Pradesh : విశాఖలో కాపురం పెడతానంటున్నావు ఎవరిని ఉద్ధరించటానికి : యనమల సెటైర్లు

yanamala rama krishnudu jagan

Updated On : April 20, 2023 / 6:18 PM IST

Andhra Pradesh :  సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. సీఎం జగన్ చేసే వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. మాట్లాడితే విశాఖ రాజధాని నేను అక్కడికే వెళ్లిపోతున్నా..ఇక నుంచి అక్కడే కాపురం అంటూ పదే పదే వ్యాఖ్యానించే జగన్ విశాఖలో కాపురం ఎవరిని ఉద్దరించటానికి అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని గురించి కేసు సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగుతుంటే జగన్ మాత్రం త్వరలోనే విశాఖ నుంచే పాలన నేను అక్కడికే షిఫ్టి అవుతున్నా అంటూ ప్రకటనలు చేస్తున్నారని కానీ ఇవ్వన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆరోపించారు.

Andhra Pradesh : 10కిలోమీటర్లు రోడ్డు వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? : ఎంపీ రామ్మెహన్ నాయుడు

అధికారంలోకి వచ్చి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకునే జగన్ ఇప్పుడు పోర్టులు కట్టేస్తాం అంటూ భీరాలు పలుకుతున్నారని నాలుగేళ్లుగా లేనిది పోర్టుల నిర్మాణం గురించి ఇప్పుడే గుర్తుకొచ్చిందా?అంటూ ఎద్దేవా చేశారు.నాలుగేళ్లు కబుర్లు చెప్పి..కాలయాపన చేసి ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించటానికి ఓట్లుకోసం పోర్టుల నిర్మాణం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారు? ఎన్నికలు దగ్గరపడుతుండగా పోర్టుల నిర్మాణాలు అంటూ శంకుస్థాపలన రాజకీయాలు మొదలుపెట్టారని సెటైర్లు వేశారు. సదస్సులో పేరుతో హడావిడి చేస్తు అభివృద్దిని గాలికొదిలేశారంటూ విమర్శించారు. విశాఖ రాజధాని అంటూ అమరావతికి భూములిచ్చిన రైతులను దగా చేశారని వారిని నడి వీధుల్లో నిలబెట్టారని వారు న్యాయం కోసం పోరాడుతుంటే జగన్ మాత్రం విశాఖ రాజధాని అంటే వారి మనోభావాలను గాయపరుస్తున్నారని విమర్శించారు. విశాఖలో రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు యనమల.

Chandra Babu : ఒకప్పుడు సెల్‌ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు

ఏపీకి పెట్టుబడుల వరదు వెల్లువెత్తిపోతోందని వైసీపీ మంత్రులు అంటున్నారని కానీ సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం నిధుల్లేకి పథకాలు వాయిదా వేశామని చెబుతున్నారని దీన్ని బట్టి చూస్తే మంత్రులు ఎంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. జగన్ అవగాహన లేని తుగ్లక్ నిర్ణయాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని ఎద్దేవా చేశారు యనమల.

Rayapati Sambasiva Rao : చంద్రబాబు చెబితే నేను నరసరావు పేట నుంచి పోటీ చేస్తా : రాయపాటి