రామ్మోహన్ నాయుడు అలా.. గౌతు శిరీష ఇలా.. వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికలపై తెలుగు దేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రామ్మోహన్ నాయుడు అలా.. గౌతు శిరీష ఇలా.. వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు

Ram Mohan Naidu, Gouthu Sireesha: వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత అధికార పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని శ్రీకుకాళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పగా.. వైసీపీ నాయకులను తీసుకోవద్దని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానాన్ని కోరారు.

రామ్మోహన్ నాయుడు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీల చేరికలపై స్పందించారు. ”అభివృద్ధిని చూసి కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతాం. పార్టీలోకి వచ్చే వారు రాజీనామా చేసి చేరుతారు. రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఎలాగూ అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంది. దాంతో తదుపరి ఏర్పడే ప్రతి ఖాళీ మాకే వస్తుంది. అభివృద్ధిని చూసి మా పార్టీలోకి వస్తున్నారు. అభివృద్ధిని కోరుకునే వారికి మేము ఆహ్వానం పలుకుతాం. ఇతర పార్టీల్లోనూ కొందరు మంచి నేతలు ఉన్నారు. మా పార్టీలో చేరేవారు పదవులకు రాజీనామా చేసి వస్తే చేర్చుకుంటామ”ని చెప్పారు.

Also Read: వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!

అలాంటి నేతలను మన పార్టీలోకి తీసుకోవద్దు
మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత.. టీడీపీ లేదా బీజేపీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలాస తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను చేర్చుకోవద్దని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలోకి తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లని పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టేనని ఆమె అన్నారు.

Also Read: అందుకే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పా.. తాడిపత్రి రూరల్ సీఐ క్లారిటీ