Gudivada Casino : క్యాసినో రగడ.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం- వర్ల రామయ్య

కొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.

Gudivada Casino : క్యాసినో రగడ.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం- వర్ల రామయ్య

Gudiwada Casino

Updated On : January 25, 2022 / 9:47 PM IST

Gudivada Casino : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులు చంద్రబాబుని కలిశారు. గుడివాడ క్యాసినో అంశంపై చంద్రబాబుకి అందచేసిన నివేదికపై చర్చించారు.

గుడివాడలో క్యాసినో నిర్వహణపై రూపొందించిన సమగ్ర నివేదికను గవర్నర్ కి అందచేసేందుకు రేపు ఆయన సమయం కోరామని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. గవర్నర్.. రేపు లేదా ఎల్లుండి సమయం ఇస్తే క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. క్యాసినో జరిగింది వాస్తవం అన్న వర్ల రామయ్య.. పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఈడీ, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఇన్ కమ్ టాక్స్ విభాగాలు సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

కొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. జగన్.. ఆత్మలతో మాట్లాడినట్లు, కొడాలి నాని ఆయన తండ్రి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. వర్ల రామయ్యతో ఎందుకు పెట్టుకున్నావ్? అని కొడాలి నాని తండ్రి ఆత్మ కచ్చితంగా హెచ్చరిస్తుందన్నారు. వర్ల రామయ్య పోలీసు అధికారిగా కొడాలి నానిని ఎన్నిసార్లు కొట్టారు, ఏఏ కేసులు పెట్టారో నేను ఇప్పుడు చెప్పను అని అన్నారు.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

మహిళలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన సిగ్గులేని మంత్రి కొడాలి నాని అని మాజీమంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదని, జాతీయ స్థాయిలో పోరాడతామన్నారు. రాష్ట్రం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో పాలన ఉందని ఆరోపించారు.