Chandrababu Arrest: టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ దీక్షలు.. ఎవరెవరు ఎక్కడ దీక్షలో పాల్గొంటున్నారంటే..

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు నిరసన దీక్షలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులోనే ..

Chandrababu Arrest: టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ దీక్షలు.. ఎవరెవరు ఎక్కడ దీక్షలో పాల్గొంటున్నారంటే..

Chandrababu

Chandrababu Arrest Satyameva Jayate Initiations: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ రోజుకో విధంగా నిరసనలు తెలుపుతున్నారు. శనివారం రాత్రి 7గంటల నుంచి 7.05 గంటల వరకు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు, సానుభూతిపరులు మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

Read Also : Kottu Satyanarayana : అమరావతి భూ కుంభకోణంలో పవన్ కల్యాణ్‌కి కూడా వాటా ఉంది- మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్షలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులోనే దీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు బాబు జైలులోనే దీక్షలో పాల్గోనున్నారు. అదేవిధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం విద్యానగర్ లో ఆమె బస చేసిన కేంద్రం వద్ద నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సమీపంలోని జాతిపిత విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి క్వారీ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి 10గంటలకు చేరుకొని నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం 5గంటల వరకు ఆమె దీక్షలో కూర్చోనున్నారు. ఈ దీక్షా శిబిరంలోమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Read Also : TDP Leaders Tension : టీడీపీ-జనసేన పొత్తు.. టెన్షన్ పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కారణం ఏంటంటే..

చంద్రబాబు, నారా భవనేశ్వరి దీక్షలకు మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. దీక్షలో టీడీపీ ఎంపీలుకూడా పాల్గోనున్నారు. మంగళగిరిలో అచ్చెన్నాయుడు నిరాహార దీక్షలో పాల్గోనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ మహిళా నేత సుహాసిని సత్యమేవ జయతే దీక్షలో పాల్గోనున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి దీక్షకు సంఘీభావంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.