Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసుల నోటీసులు.. ఏ కేసులో అంటే..
పోలీసులు ఇచ్చిన నోటీసులపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు.

Duvvada Srinivas
Duvvada Srinivas : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు నోటీసులిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గతంలో విమర్శలు చేసిన కేసులో 41ఏ నోటీసులు అందించారు. పవన్ పై దూషణలు, జనసేన ఆఫీస్ పై దాడి చేశారని దువ్వాడపై గతంలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఏడాది క్రితం విమర్శలు చేస్తే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది ఆయన ఆరోపించారు.
”రెండేళ్ల క్రితం పవన్ ను ఉద్దేశించి నేను అన్న మాటలను ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని అనుకునేటప్పుడు.. నాపై ఫిర్యాదు ఎవరు ఇవ్వాలి? పవన్ కల్యాణ్ ఇవ్వాలి. నాపై పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? 18-11-24 చేసిన ఎఫ్ఐఆర్ కి ఇవాళ నోటీసులు ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. న్యాయం లేదా? చట్టం ఏం చేస్తోంది? ఇష్టానుసారం ఇలా కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడితే, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తే నోరెత్తం అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా” అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.
2021-22లో నాటి టెక్కలి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనేక ఆరోపణలు చేశారని, పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని.. జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ నెల రోజుల క్రితం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. దువ్వాడ శ్రీనివాస్ కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నోటీసులపై దువ్వాడ తీవ్రంగా స్పందించారు. గతంలో పవన్ కల్యాణ్ తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాతే తాను రియాక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని ఆయన ఎదురుదాడికి దిగారు.
Also Read : YSRCP: వైసీపీలో కాపు నేతలు ఖాళీ అవుతున్నారా?