Revanth Reddy: ‘ఇది నెంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం’.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
రేవంత్ ట్వీట్ ప్రకారం.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.

Telangana CM Revanth Reddy
CM Revanth Reddy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకిరాగా.. పదేళ్లు అధికారంలోనే కొనసాగింది. 2023 డిసెంబర్ నెలలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికార పీఠాన్ని అదిరోహించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మరికొద్ది రోజుల్లో తెలంగాణ సర్కార్ ఏర్పడి ఏడాది కాబోతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది రోజులపాటు సంబరాలు నిర్వహిస్తోంది. ఇదిలాఉంటే.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గతేడాది ఇదేరోజున జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ఆసక్తికర విషయాలను ప్రస్తావిస్తూ పోస్టు చేశారు.
Also Read: Gossip Garage : ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర కోణం? దుమారం రేపుతున్న మంత్రుల వ్యాఖ్యలు..
రేవంత్ ట్వీట్ ప్రకారం.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతోపాటు.. రూ.7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్, రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్, రూ.1433 కోట్ల రైతుబీమా, రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం, రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేయడం జరిగిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఏడాదిలో 54వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాంమని అన్నారు. ఇది నెంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అని రేవంత్ పేర్కొన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: Gold Price: దేశవ్యాప్తంగా మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత…— Revanth Reddy (@revanth_anumula) November 30, 2024