Vangaveeti Radha : వంగవీటి రాధాను కలిసిన ఎంపీ కేశినేని నాని
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారనే నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈరోజు వంగవీటి రాధా

Mp Kesineni Nani Meet Vangaveeti Radha
Ex-MLA Vangaveeti Radha : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారనే నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈరోజు వంగవీటి రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వారు రాధాకు సూచించారు. ఈ సందర్భంగాఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….. డీజీపీ, సీపీ విజయవాడ నగరంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని…. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దని కోరారు.
పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని…..హత్యా రాజకీయాలను ఆనాడు ఎన్టీఆర్,చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదని నాని అన్నారు. వంగవీటి రాధా మంచి వ్యక్తని….తాను నష్టపోతాడు కానీ…. ఎవరిని రాధా ఇబ్బంది పెట్టడని ఎంపీ వ్యాఖ్యానించారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని ఎంపీ నాని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను…. ఈ అంశం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పారు.
Also Read : భార్యకు ఫోన్‌లో ‘I LOVE YOU’ చెప్పిన బాలయ్య