మంత్రి బొత్స ఇంటి దగ్గర ఉద్రిక్తత
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాజధాని అమరావతి, మూడు రాజధానుల ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా రాజధాని రగడపై స్పందించిన బొత్స.. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు. అమరావతి రైతులెవరూ ఆందోళన చెందొద్దని.. ఎలాంటి అపోహలకు గురికావొద్దని కోరారు. చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసినట్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ తాము చేయబోమని… గ్రాఫిక్స్, సినిమాలు చూపించమని.. అన్నీ వాస్తవాలే చెబుతామన్నారు బొత్స. అమరావతిలో 50 శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. మంత్రి మండలి సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? అని బొత్స ప్రశ్నించారు.