father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు.

Murder
father killed son : రోజు రోజుకూ మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి. కొందరిలో మానవత్వమే లేకుండా పోతోంది. కన్నకొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కడతేర్చాడు. కన్నతండ్రే కొడుకును కాటికి పంపాడు. కని, పెంచిన చేతులతోనే ఖతం చేశాడు. దయ, జాలి, కనికరం లేకుండా చంపేశాడు. అది కూడా అల్లుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
Software Engineer : రెండేళ్ల కొడుకును గొంతుకోసి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. పర్చూరు మండలం ఏదుబాడులో అల్లుడితో కలిసి తండ్రి కుమారుడిని హత్య చేశాడు. కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.