Supreme Court Notices : అమరావతి రాజధానిపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు

అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది.

Supreme Court Notices : అమరావతి రాజధానిపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు

SUPREME

Updated On : January 10, 2023 / 5:12 PM IST

Supreme Court Notices : అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు పలువురు అధికారులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గతంలో అమరావతి నిర్మాణాల కాల పరిమితిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే నిరాకరించింది.

Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశం

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి ప్రతివాదులుగా ముఖ్యంగా 161 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులందరికీ నోటీసులు పంపించింది.