Gudivada Amarnath : ఇది లోకల్-నాన్ లోకల్‌కు జరుగుతున్న యుద్ధం, అందుకే విశాఖ రాజధానిపై విషం
ఉత్తరాంధ్ర ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్నారు. మీ రియల్ ఎస్టేట్ కోసం అమరావతి కావాలి అమరావతి భూములు కావాలి. Gudivada Amarnath

Minister Gudivada Amarnath On Visakha Capital
Gudivada Amarnath On Visakha Capital : టీడీపీ, జనసేనలపై ఫైర్ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ రాజధాని అంశంలో ప్రతిపక్షాల తీరుని ఆయన ఎండగట్టారు. అమరావతిలో భూముల విలువ ఎక్కడ కోల్పోతామో అని విశాఖ రాజధాని ఆంశంపై విషం కక్కుతున్నారు అని మండిపడ్డారు. విశాఖ రాజధాని గురించి గోల చేస్తున్న వీళ్లంతా నాన్ లోకల్ బ్యాచ్ అని మంత్రి అమర్నాథ్ విమర్శించారు.
”విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అందుకు అనుగుణంగా ఉన్న భవనాలు ఎంపికకు సంబంధించి ప్రభుత్వం అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కొన్ని పత్రికలు ఈ విషయంపై విషం చిమ్ముతున్నాయి. విశాఖలో పుట్టి అభివృద్ది చెందిన ఓ పత్రిక.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు వ్యవహరిస్తోంది. వీళ్ళంతా నాన్ లోకల్ బ్యాచ్. లోకల్ – నాన్ లోకల్ కు జరుగుతున్న యుద్ధం ఇది.
పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్ట్:
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకున్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చే పొలిటికల్ టూరిస్ట్ పవన్ కల్యాణ్. గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ ఎన్నిసార్లు గాజువాక వచ్చారు? రాజకీయాలకు ఉత్తరాంధ్ర కావాలి. మీరు మాత్రం తెలంగాణలో ఉంటారు.
Also Read : చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
పురంధేశ్వరిని బిజెపి నాయకురాలిగా చూడటం లేదు:
పురంధేశ్వరిని బిజెపి నాయకురాలిగా మేము చూడటం లేదు. ఈ ప్రాంతానికి చెందని వారు వచ్చి ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ గురించి మాట్లాడుతున్న మీరు పక్కనే ఉన్న గీతం యానివర్సీటిలో 40 ఎకరాలు కబ్జా కనిపించడం లేదా? 1000 కోట్లు విలువైన భూమిని కబ్జా చేస్తే ఎందుకు స్పందించడం లేదు? మీ రియల్ ఎస్టేట్ కోసం అమరావతి కావాలి అమరావతి భూములు కావాలి. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీకు అధికారం ఇస్తే ఏం చేశారో చూశాం.
చంద్రబాబు బరువు తగ్గలేదు పెరిగారు..
చంద్రబాబు జైల్లో ఉండి కేజీ బరువు పెరిగారు. చంద్రబాబుని ఇంట్లో బాగా చూసుకుంటున్నారో లేక జైల్లో బాగా చూసుకుంటున్నారో తెలుసుకోండి. ఎవరికీ రాని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. 66 కేజీలతో జైలుకి వచ్చిన వ్యక్తి 67 కేజీలు పెరిగారు. నాకు మీ మీద అనుమానంగా ఉంది. చంద్రబాబుకు పెట్టే పుడ్ ముందు లోకేశ్ కి పెట్టి ఆ తర్వాతే చంద్రబాబుకి పెట్టాలని జైలు అధికారులను కోరుతున్నా. ఏ తప్పు చేయకుండా ఉంటే అన్నీ ఉండేవి. చంద్రబాబు నెల రోజుల్లో 68 కేజీల బరువు పెరిగే బాధ్యత మాది. మేము అన్ని విధాల చంద్రబాబును బాగా చూసుకుంటాము” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు